News May 2, 2024

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు జిల్లా ఎస్పీK.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. గురువారం జిల్లా వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా బిట్రగుంట పరిధిలో-80, జలదంకి-45, దగదర్తి-41, మనుబోలు-15 & FJ Wash-1600 లీటర్లు, SEB-219 మద్యం బాటిల్స్ లను సీజ్ చేసామన్నారు. 

Similar News

News October 15, 2025

తహశీల్దార్ ఫిర్యాదు FIR కాలేదు ఎందుకో.?

image

తనపై దౌర్జన్యం జరిగిందని లింగసముద్రం తహశీల్దార్ స్వయంగా ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు అదేరోజు FIR ఎందుకు చేయలేదన్న విమర్శలు చెలరేగుతున్నాయి. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి ఫిర్యాదు ఇస్తే అది కూడా FIR కాకపోవడం చర్చనీయాంశమైంది. లింగసముద్రం SI నారాయణ తీరు పట్ల తహశీల్దార్ సైతం అసహనం వ్యక్తం చేశారు. బాధితుల పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించకపోతే ఎలా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News October 15, 2025

జిల్లా నుంచి PM కర్నూలు సభకు 250 బస్సులు కేటాయింపు

image

ఈనెల 16న కర్నూలు జిల్లాలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు జిల్లా నుంచి 250 బస్సులను అధికారులు కేటాయించారు. కర్నూలు(D) ఓర్వకల్లు మండలంలోని నన్నూరు వద్ద నిర్వహించే ఈ సభకు నెల్లూరు డిపో 1నుంచి 40, నెల్లూరు డిపో 2 నుంచి 50, ఆత్మకూరు డిపో నుంచి 31, కందుకూరు డిపో నుంచి 35, కావలి డిపో నుంచి 40, ఉదయగిరి డిపో నుంచి 29, రాపూరు డిపో నుంచి 25 వరకు బస్సులు కేటాయించారు.

News October 15, 2025

కౌశల్-2025 క్విజ్ పోటీల పోస్టర్ ఆవిష్కరణ

image

కౌశల్-2025 క్విజ్ పోటీల పోస్టర్‌ను డీఈవో బాలాజీ రావు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో చదువుతున్న 8, 9, 10 తరగతుల నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులకు నవంబర్ 1 నుంచి పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రంలో భారతీయుల కృషి’ అనే అంశాలపై క్విజ్ నిర్వహిస్తామన్నారు.