News April 9, 2025
సాలార్జంగ్ మ్యూజియంలో అంబేడ్కర్ ఫొటో ఎగ్జిబిషన్

సాలార్జంగ్ మ్యూజియంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించినట్లుగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఘంటా చక్రపాణి, IIS డైరెక్టర్ ఆశిష్ గోయల్ తెలిపారు. అంబేడ్కర్ జీవితం మొత్తం కనులకు కట్టినట్లు ఎగ్జిబిషన్లో అద్భుతంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 15, 2025
వేములవాడలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

దక్షిణ కాశీ వేములవాడ క్షేత్రంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు వరుసగా 25వ రోజు కార్తీక దీపోత్సవంలో భాగంగా భక్తులు భీమేశ్వరాలయం ఆవరణలో దీపాలను వెలిగించారు. కార్తీక దీపాలతో ఆలయ ఆవరణ కాంతులీనింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఆలయ ఈ రాజేష్, ఏఈఓ శ్రావణ్ ప్రసాదం, వాయనం అందజేశారు.
News November 15, 2025
రేపు బాపట్ల జిల్లాకు రానున్న గవర్నర్

గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ ఉదయం 10 గంటలకు రాజ్భవన్ నుంచి బయలుదేరి 11.45కి సూర్యలంక గోల్డెన్ సాండ్ బీచ్ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7.55కి తిరుగు ప్రయాణం అవుతారు. పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు.
News November 15, 2025
చంద్రగిరి: బీటెక్ విద్యార్థి మృతి

చంద్రగిరి మండలం కోదండరామాపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యానికి చెందిన లక్ష్మీకాంత్ చిత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్పై తిరుపతికి వచ్చే క్రమంలో లారీని ఢీకొన్నాడు. విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


