News April 14, 2025
సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు.. జూపార్క్ ఓపెన్

అంబేడ్కర్ జయంతి సందర్భంగా సాలార్ జంగ్ మ్యూజియానికి అధికారులు సెలవు ప్రకటించారు. యథావిధిగా రేపు ఉదయం టూరిస్టులకు అనుమతి ఉంటుందని అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ అధికారి ఘన్ శ్యామ్ కుసుమ్ తెలిపారు. ఇదిలా ఉంటే సాధారణంగా ప్రతి సోమవారం జూపార్క్కు సెలవు ఉంటుంది. కానీ, నేడు తెరిచే ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. సందర్శకులు గమనించాలని సూచించారు.
Similar News
News October 30, 2025
తిరుమలలో మరిన్ని శాశ్వత క్యూలైన్లు

AP: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. SSD టోకెన్లు కలిగిన భక్తుల కోసం తిరుమలలోని ఏటీజీహెచ్ అతిథి గృహం సమీపంలో నూతన షెడ్లు, క్యూలైన్ల మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించింది. బాటగంగమ్మ ఆలయం నుంచి గోగర్భం జలాశయం కూడలి వరకు 3కి.మీ మేర రూ.17.60 కోట్లతో శాశ్వత క్యూలైన్లు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించనుంది. భక్తుల రద్దీని దృష్టిని ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
News October 30, 2025
గుంటూరు జిల్లాకు రక్షణ కవచంలా ‘ఆ ఇద్దరు’

మొంథా తుఫాను బారినుంచి గుంటూరు జిల్లాను కాపాడటంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ కీలక పాత్ర పోషించారు. తుఫాను అలెర్ట్ మొదలైనప్పటి నుంచి జిల్లా యంత్రాంగాన్ని వీరు ఉరుకులు పరుగులు పెట్టించారు. అటు అధికారులను ఇటు ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఫలితంగా అధికారులు సిబ్బంది తుఫాను తీవ్రత తగ్గించటంలో సఫలీకృతలయ్యారు. వీరిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
News October 30, 2025
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం: కలెక్టర్

జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రోజువారీ నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం అమలు చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి రూ.3 వేలు చొప్పున సహాయం అందజేయాలన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి బియ్యం, కంది పప్పు, వంట నూనె, ఉల్లిపాయలు అందిస్తున్నామన్నారు.


