News March 29, 2025
సాలూరు: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస గ్రామానికి చెందిన ఐశ్వర్య(20) చీపురువలస సమీపంలోని జీడి తోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఓ యువకుడిపై అనుమానంతో అతని కోసం గాలిస్తున్నారు.
Similar News
News October 17, 2025
తిరుమల శ్రీవారి జనవరి కోటా విడుదల తేదీలివే

2026 జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ, సుప్రభాతం, అర్చన టోకెన్ల కోసం ఈ నెల 19న 10am నుంచి 21న 10am వరకు <
News October 17, 2025
గన్నేరువరం: యువతి ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. గన్నేరువరం SI ప్రకారం.. గన్నేరువరం మండలం హన్మాజీపల్లి గ్రామానికి చెందిన బోయిని జ్యోతి(21) గురువారం రాత్రి పురుగుమందు తాగింది. వెంటనే KNRలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 10 గంటలకు మరణించింది. మృతురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
News October 17, 2025
19న రైఫిల్ షూటింగ్ జట్ల ఎంపిక

ఈ నెల 19 (ఆదివారం)న శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజీలోని రైఫిల్ షూటింగ్ రేంజ్‌లో అండర్-14, 17, 19 ఉమ్మడి జిల్లా బాలబాలికల రైఫిల్ షూటింగ్ జట్ల ఎంపికలు ఉంటాయని ఉమ్మడి ఖమ్మం డీఈఓలు శ్రీజ, నాగలక్ష్మి తెలిపారు. 6వ తరగతి నుంచి ఆ పై చదువుతున్న విద్యార్థులు అక్టోబరు 19న ఉదయం 9 గంటలకు స్టడీ సర్టిఫికేట్, ఫొటోతో కూడిన అర్హత ఫారంతో హాజరు కావాలని సూచించారు.