News February 3, 2025
సాలూరు అమ్మవారి పండుగపై మంత్రి సమీక్ష

సాలూరు శ్యామలాంబ తల్లి పండుగను మే 18,19,20 తేదీల్లో నిర్వహించనున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ పండగ జరగనుంది. దీంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. పండగ ఏర్పాట్లపై పెద్దలు, అధికారులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Similar News
News November 23, 2025
ములుగు: ‘పనితీరు’కు పట్టం!

జిల్లా డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం ‘పనితీరు’కే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. రెండోసారి ములుగు డీసీసీ అధ్యక్షుడిగా పైడాకుల అశోక్ ఎన్నికయ్యారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయన పార్టీ గెలుపు కోసం అన్ని తానై కృషి చేశారని పేరు ఉంది. కొత్తవారికి అవకాశం ఇస్తారని ఊహాగానాలు కొనసాగినప్పటికీ, అధిష్టానం పైడాకులకే మరోసారి పట్టం కట్టింది.
News November 23, 2025
వేములవాడ భీమేశ్వరాలయంలో మొక్కుబడి సేవలు

వేములవాడ రాజన్న ఆలయ అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి భక్తుల మొక్కుబడి సేవలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆది, సోమవారాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే, భక్తుల సౌకర్యార్థం నిత్య అన్నదాన సత్రం పైభాగంలోని కళ్యాణ మండపంలో నిత్య కళ్యాణం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 23, 2025
HYD: ఇలా అయితే భవిష్యత్లో నిటి కటకటే!

ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాలకు వరద ప్రవాహానికి వచ్చే వ్యర్థాలు అడుగున చేరి నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. ఇటీవల నీటి వనరుల విభాగం ఉన్నతస్థాయి కమిటీ పరిశీలనలో భారీగా పూడిక పేరుకుపోయి నీటి సామర్థ్యం సాధారణ స్థాయి కంటే తగ్గుముఖం పట్టినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నీటి సామర్థ్యం 60% కంటే దిగువకు పడిపోతే భవిష్యత్తులో నీటి తరలింపు సమస్యగా మారే ప్రమాదం ఉందని వెల్లడైంది.


