News April 9, 2024
సాలూరు: కేజీన్నర బంగారం చీరతో అలంకరణ

సాలూరులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఉగాది పర్వదినం సందర్భంగా బంగారు చీరతో అలంకరించారు. సుమారు 1500 గ్రాముల బంగారు తాపడంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ బంగారు చీరలో తల్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల నుంచి అధిక మొత్తంలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Similar News
News April 11, 2025
విజయనగరం జిల్లాలో రాబోయే 3 గంటల్లో వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం జిల్లాలో వాతావరణ మారింది. వేపాడ, రాజాం, వంగర, నెల్లిమర్లతో పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
News April 10, 2025
దిగ్గజ నేతలు మెచ్చిన విజయనగరం జర్నలిస్ట్ ‘చింతామణి’

దేశ జర్నలిజం రంగానికి దిట్ట సర్ CY చింతామణి. జర్నలిజమే శ్వాసగా చివరి క్షణం వరకు కలాన్ని విడిచిపెట్టలేదు. లీడర్ అనే పత్రిక ద్వారా నెహ్రూ, తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి దిగ్గజాలకు అభిమాన పాత్రికేయుడిగా మారారు. విజయనగరంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన చింతామణి సుదీర్ఘకాలంగా ఎడిటర్‌గా పనిచేసి జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. UP నుంచి MLAగా గెలిచి మంత్రిగానూ పని చేశారు. నేడు ఆయన జయంతి.
News April 10, 2025
VZM: రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీచర్ మృతి

పద్మానాభంకి చెందిన వి.రమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 11 గంటలకు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం వ్యక్తిగత పనిమీద విజయనగరం బైక్‌పై వెళ్తుండగా చిన్నాపురం సమీపంలో మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనగా రమణ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన ఎస్.రాయవరం హైస్కూల్లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నారు.