News June 5, 2024

సాలూరు తొలి మహిళా ఎమ్మెల్యేగా సంధ్యారాణి

image

సాలూరు నియోజకవర్గం తొలి మహిళా ఎమ్మెల్యేగా గుమ్మిడి సంధ్యారాణి రికార్డు సాధించారు. పీడిక రాజన్నదొరపై 13,733 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. సాలూరులో 1952 నుంచి పురుషులే ఎమ్మెల్యేగా పనిచేశారు. తొలిసారిగా మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే సాలూరు నుంచి ఎమ్మెల్సీగా పని చేసిన తొలి వ్యక్తి సంధ్యారాణి కావడం గమనార్హం. ఎమ్మెల్సీగా పని చేసిన అనంతరం ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Similar News

News September 17, 2025

ఈనెల 19న ఉద్యోగుల కోసం గ్రీవెన్స్: కలెక్టర్

image

ఈ నెల 19వ తేదీ శుక్ర‌వారం ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక గ్రీవెన్స్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.రామ‌సుంద‌ర్ రెడ్డి బుధవారం తెలిపారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఈ కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొంటార‌ని వెల్లడించారు. ఉద్యోగులు త‌మ స‌మ‌స్య‌ల‌పై ఈ గ్రీవెన్స్‌లో ధ‌ర‌ఖాస్తుల‌ను అంద‌జేయ‌వ‌చ్చున‌ని సూచించారు. ప్రతి 3వ శుక్రవారం కార్యక్రమం జరుగుతుందన్నారు.

News September 17, 2025

VZM: సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం

image

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ బుధవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గంట్యాడ (M) కొండతామరపల్లిలోని చల్ల అప్పలనాయుడు కల్లంలో గుర్తించిన ఈ చెట్లకు ఉదయం 9.15 గంటలకు బొట్టు పెట్టే కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారి బంటుపల్లి వెంకటరావు, ఈవో శిరీష, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్, ప్రెసిడెంట్ భాస్కర్, భక్తులు పాల్గొన్నారు.

News September 17, 2025

గంట్యాడ: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ మంగళవారం మృతి చెందింది. భీమవరం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి ఈనెల 12న రాత్రి గంట్యాడ మండలం కొండతామరపల్లి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.