News January 25, 2025
సాలూరు: నేడు మంత్రి సంధ్యారాణి షెడ్యూల్ ఇదే

జిల్లాలో నేడు పార్వతీపురం, మక్కువ మండలాలలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పార్వతీపురం లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో నిర్వహించే జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు మక్కువ వెంగళరాయ సాగర్లో చేప పిల్లలను విడిచిపెట్టే కార్యక్రమంలో పాల్గొని, అనంతరం శంబర పోలమాంబ జాతర ఏర్పాట్లను పరిశీలిస్తారు.
Similar News
News November 18, 2025
వందల మంది మృతికి హిడ్మానే కారణం!

దండకారణ్యంలో బలగాల్ని నడిపించే వ్యూహకర్తగా గుర్తింపు పొందిన హిడ్మా.. కేంద్ర బలగాలపై మెరుపుదాడుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. PLGA 1వ బెటాలియన్కు నాయకత్వం వహిస్తూ, కేంద్ర కమిటీలో చిన్న వయస్కుడిగా ఎదిగాడు. పలు దాడుల్లో కీలకపాత్ర పోషించాడు.
*2010 దంతెవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు మృతి
*2013 జిరామ్ ఘాట్లో కాంగ్రెస్ నేతలతో సహా 27 మంది మృతి
*2021 సుక్మా-బీజాపూర్లో 22 మంది భద్రతా సిబ్బంది మృతి

తుమ్మలను BRS వదులుకోవడం పెద్ద తప్పు: కవిత

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నాయకుడిని దూరం చేసుకోవడం పెద్ద తప్పని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. పార్టీలో తనపై కుట్ర చేసి బయటకు పంపారని ఆరోపించారు. ఉద్యమ నాయకులను కూడా ఇబ్బందులు పెట్టారని, కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందన్నారు. తాను వెళ్తున్న ప్రతి ప్రాంతానికి బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని ఆమె తెలిపారు.