News March 24, 2025
సాలూరు: పార్లమెంట్లో “అరకు కాఫీ స్టాల్’

పార్లమెంట్లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అరకు కాఫీ స్టాల్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్‌కు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరం, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 1, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 1, 2025
మరోసారి విఫలమైన హిట్‌మ్యాన్

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచారు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో 13 పరుగులకే ఆయన వెనుదిరిగారు. తొలి నుంచి ఆయన షాట్లు కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ సీజన్లో సీఎస్కేపై డకౌట్, గుజరాత్‌పై 8 పరుగులు మాత్రమే చేశారు. కేకేఆర్‌తో మ్యాచులోనూ తక్కువ స్కోరు చేసి విఫలమయ్యారు. కాగా గత ఐపీఎల్ సీజన్ నుంచి హిట్‌మ్యాన్ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్న విషయం తెలిసిందే.
News April 1, 2025
మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ

మంచిర్యాలలోని ఎస్ఆర్ఆర్ కాలనీలో రాధాకృష్ణ అనే సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 29న ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని తన కూతురు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో దుండగులు ఇంటి తాళం పగులగొట్టి లాకర్లోని రూ.65 వేలు విలువ చేసే 20 గ్రా బంగారం, 50 తులాల వెండి ఎత్తుకెళ్లారు. రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.