News March 24, 2025

సాలూరు: ‘పార్లమెంట్‌లో గిరిజన ఉత్పత్తులు’ 

image

పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కలిశారు. ఈ సందర్భంగా గిరిజన ఉత్పత్తులు, అరకు కాఫీని వారికి మంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 6, 2025

స్త్రీ నిధి రుణాలు, రికవరీపై కలెక్టర్ సమీక్ష

image

స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ పనితీరు, ఆర్థికప్రణాళికలు, రుణాల పంపిణీపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం కలెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించారు. ఎస్‌హెచ్‌జీల్లో కొత్తసభ్యులను చేర్చుకోవాలన్నారు. మార్చి2026 వరకు జిల్లాలో ఎన్‌పీఏ లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి మంగళ,శనివారాలను ‘రికవరీ డే’గా నిర్ణయించి, స్త్రీనిధిలో బ్యాంక్ లింకేజీ, సామాజిక పెట్టుబడి నిధి బకాయిలు లేకుండా చూడాలని సూచించారు.

News November 6, 2025

ములుగు జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలు

image

ములుగు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు 184 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. మహిళా సంఘాలు 59, ప్రాథమిక సహకార సంఘాలు 99, రైతు ఉత్పాదక సంస్థ 8, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 18 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేసి, మద్దతు ధర అందించనున్నట్లు తెలిపారు.

News November 6, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.