News April 5, 2024

సాలూరు వీఆర్వో శ్రీరాములు మృతి

image

సాలూరు వీఆర్వో గోర్జ శ్రీరాములు(57) హార్ట్‌ఎటాక్‌తో మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. పెదబోరబంద గ్రామానికి చెందిన శ్రీరాములు సాలూరు పట్టణంలో వీఆర్వోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఆఫీసులోనే గుండె నొప్పి వచ్చింది. స్పందించిన తోటి సిబ్బంది హుటాహుటిన విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News January 16, 2025

సీతానగరం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

సీతానగరం మండలం మరిపివలస గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లోలుగు రాంబాబు (44), అతని కుమారుడు మోక్ష శ్రీహాన్ (5) తమ కుటుంబ కలిసి వెళ్తుండగా వెనకనుంచి లారీ ఢీకొనడంతో మృతి చెందారు. పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తున్నారు.

News January 16, 2025

VZM: కానిస్టేబుల్ ఎంపికలు.. 185 మంది గైర్హాజరు

image

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య ఎంపిక ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 415 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 185 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి జరిగింది.

News January 16, 2025

VZM:ర‌హ‌దారి నిబంధ‌న‌ల‌ను పాటించాలి:కలెక్టర్

image

ర‌హ‌దారిపై ప్ర‌యాణించేట‌ప్పుడు ప్ర‌తీఒక్క‌రూ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్కర్ కోరారు. జాతీయ ర‌హ‌దారి భ‌ద్ర‌తా మాసోత్స‌వాల‌ను క‌లెక్ట‌ర్ త‌మ ఛాంబ‌ర్‌లో గురువారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన గోడ‌ప‌త్రిక‌ల‌ను ఆవిష్క‌రించారు. అజాగ్రత్త‌గా వాహ‌నాన్ని న‌డ‌ప‌డం వ‌ల్లే 90 శాతం ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం ద్వారా వీటిని నివారించవచ్చున్నారు.