News March 24, 2025
సాలూర: చెరువులో పడి యువకుడు మృతి

సాలూర మండలం జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన మోతేవార్ రమేశ్(26) చెరువులో పడి మృతి చెందాడు. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డ వివరాలు.. రమేశ్ పొలానికి వెళ్లి తిరిగి ఇంటికెళ్తుండగా మార్గమధ్యంలో కాలకృత్యాలు చేసుకొని స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతుడి తండ్రి నాగనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
Similar News
News December 10, 2025
NZB: తొలి విడతలో ఓటేసే వారు ఎంతమంది అంటే..?

తొలి విడతలో GP ఎన్నికలు జరిగే బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, వర్ని, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో 2,61,210 మంది ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇందులో మహిళలు 1,37,413 మంది మహిళలు, పురుషులు 1,23,790, ఇతరులు ఏడుగురు ఉన్నారు. కాగా 11 మండలాల్లో 1,653 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
News December 10, 2025
నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ముచ్చట్లు

పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నిన్నటితో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో 29 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 155 స్థానాలకు 466 మంది పోటీలో నిలిచారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. 19 గ్రామాలు ఏకగ్రీవం కాగా 146 స్థానాలకు 548 మంది బరిలో ఉన్నారు. గుర్తులు కేటాయించడంతో ప్రచార పర్వం మొదలైంది.
News December 10, 2025
NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.


