News February 17, 2025

సాలెగూడలో ఐదుగురిపై కేసు

image

ఆసిఫాబాద్ మండలం సాలెగూడ గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ముందస్తు సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేసి ఐదుగురు జూదరులను పట్టుకున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు. వారి వద్ద రూ.3,020 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News November 13, 2025

తిరుమల: అన్ని వేళ్లు వైవీ సుబ్బారెడ్డి వైపే…!

image

తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో అన్ని వేళ్లు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వైపే చూపిస్తున్నాయి. గతంలో ఉన్న టెండర్ల విధానంలో మార్పులు తీసుకురావడంతో ఆయన తీరుపై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. దానికి తోడు ఆయన పీఏ చిన్న అప్పన్న అరెస్టుతో కూడా సుబ్బారెడ్డిపై అనేక ఆరోపణలకు కారణమవుతుంది.

News November 13, 2025

క్షేత్ర స్థాయి పరిశీలనలో వరంగల్ మున్సిపల్ కమిషనర్

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ నగరంలోని పలు డివిజన్లలో ఆకస్మికంగా పర్యటించి వసతులను పరిశీలించారు. 34వ డివిజన్ శివనగర్‌లో ఆమె పర్యటించి తాగునీటి సమస్య, డ్రైనేజీలు, పారిశుద్ధ్య కార్మికుల పనితీరును పరిశీలించారు. డివిజన్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.

News November 13, 2025

ఉమ్మడి మెదక్ నుంచి టీ.టీకి ఎంపికైంది వీరే.!

image

ఉమ్మడి మెదక్ జిల్లా టీ.టీ అండర్ -14, 17 బాల, బాలికలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. U/17 బాలురు.. జి.గౌతమ్ కుమార్, జి.భరద్వాజ్, కే. చరణ్, U/17 బాలికలు.. పి.నవ్యశ్రీ, పి.బృహతి, ఎస్.నందిని, U/14 బాలురు.. బి.ఆయుష్, కే.ప్రతీక్, ఎస్.నర్సింగరావు, U/14 బాలికలు.. టీ.మౌనిక, ఎన్.భానుప్రియ, పి.లాస్య ఉన్నారు. వీరు ఈనెలలో ఖమ్మంలో జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొంటారని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు.