News November 10, 2024

సింగపూర్‌లో భరతనాట్యం.. అభినందించిన సింగపూర్ ప్రధాని

image

చేగుంట మండలం రుక్మాపూర్‌కు చెందిన బసిక ప్రశాంత్ రెడ్డి, అనితారెడ్డి దంపతుల కూతుర్లు అనీశ, ప్రనీశ భరతనాట్యంలో ప్రతిభ కనపరుస్తున్నారు. దీపావళి పురస్కరించుకొని శనివారం సింగపూర్ కమ్యూనిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన దీపావళి ఉత్సవాల్లో చిన్నకూతురు భరతనాట్యం చేసి అందరిని అబ్బరుపరిచారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ భారతీయుల సంస్కృతిక ప్రదర్శనలను అభినందించారు.

Similar News

News November 22, 2024

ఓయూలో ఎంఈ, ఎంటెక్‌ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

HYD OU పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరిస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ కే.శశికాంత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, మొదటి, మూడో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును సంబంధిత కళాశాలల్లో ఈ నెల 25వ తేదీ లోపు చెల్లించాలని అన్నారు. అపరాధ రుసుము రూ.500తో 28వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

News November 22, 2024

MDK: నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

image

తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నేడు జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ తెలిపారు. అండర్-8, 10, 12 విభాగాల్లో బాలబాలికలకు పరుగు పందెం, త్రో, జంప్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 9:00లోపు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 99630 05540 నంబరుకు సంప్రదించాలన్నారు.

News November 22, 2024

సంగారెడ్డి: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

image

ఐలాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన సచిన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మల్లేష్ అనే వ్యక్తికి ఇంటి నంబర్ ఇచ్చేందుకు రూ.30వేలు డిమాండ్ చేసి, రూ.25 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. 10వేలు తీసుకుంటుండగా వీడియో తీసిన మల్లేష్ సెప్టెంబర్ నెలలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ విచారణలో లంచం తీసుకున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు.