News April 7, 2025

సింగపూర్ కాన్సులేట్‌తో ఐటీ మంత్రి సమావేశం

image

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్‌తో సోమవానం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, తెలంగాణను ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. రాష్ట్రం నుంచి రెండు లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంజినీర్లను సిద్ధం చేయడం తమ ప్రధాన లక్ష్యమని శ్రీధర్‌బాబు తెలిపారు.

Similar News

News April 17, 2025

మరికల్: కొత్త బిల్డింగ్‌లోకి తహశీల్దార్, ఎంపీడీవో ఆఫీసుల తరలింపు

image

మరికల్‌లోని ఇంటిగ్రేటెడ్ మండల్ కాంప్లెక్స్ భవనంలోకి తహశీల్దార్, ఎంపీడీవో ఆఫీసులను తరలించారు. గురువారం సాయంత్రం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూజా కార్యక్రమాలను చేయనున్నారని, అనంతరం తహశీల్దార్, ఎంపీడీవో ఆఫీసుల్లో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. కాగా ఫిబ్రవరి 21న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 

News April 17, 2025

ఆత్రేయపురం: కాలుజారి వ్యక్తి గల్లంతు

image

ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామ శివారు బుల్లియ్య రేవులో కాలువ వద్ద  వ్యక్తి కాలు జారి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుల్లియ్య రేవుకు చెందిన విత్తనాల భాస్కరరావు (68) బుధవారం ఉదయం కాలువ వద్దకు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి గల్లంతయ్యాడు. వెంటనే విషయం తెలుసుకున్న బంధువులు, జాలర్లు కలిసి అమలాపురం కాలవ పొడవున గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2025

మక్కువ: ‘విద్యార్థులను కొట్టిన వార్డెన్ సస్పెండ్ చేయాలి’

image

మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులను కొట్టిన వార్డెన్‌ను తక్షణం సస్పెండ్ చేయాలని AISF నాయకులు కోరారు. జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్‌కు AISF జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రవి కుమార్, నాయకులు వినతి పత్రాన్ని బుధవారం అందజేశారు.

error: Content is protected !!