News March 29, 2025
సింగరకొండలో అరటి పండ్లతో పూజలు

అద్దంకి మండలంలోని సింగర కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం అమావాస్య సందర్భంగా స్వామివారికి పదివేల అరటి పండ్లతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారు ప్రత్యేక అలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.
Similar News
News April 3, 2025
ఆ నోళ్లను 10 నెలల్లోనే మూయించాం: లోకేశ్

AP: రాష్ట్రంలో JCB పాలన పోయి, పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి లోకేశ్ అన్నారు. తాను గెలిస్తే మంగళగిరిలోని ఇళ్లు పీకేస్తారంటూ ప్రచారం చేసిన నోళ్లను 10నెలల్లోనే మూయించామని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి పట్టాలిచ్చే హామీని తన నియోజకవర్గం నుంచే నెరవేరుస్తున్నట్లు చెప్పారు. తొలి విడత 3వేల ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. స్వచ్ఛతలో మంగళగిరిని దేశంలోనే నంబర్-1 చేస్తామని చెప్పారు.
News April 3, 2025
గూడూరులో ఎంటెక్ విద్యార్థి మృతి

గూడూరులో ఓ ఎంటెక్ విద్యార్థి చనిపోయాడు. స్థానికంగా ఉన్న ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో జశ్వంత్ ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో కాలేజీ బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి అతను దూకేశాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాలేజీ యాజమాన్యం వేధింపులతోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
News April 3, 2025
GDR: ఎంటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి