News March 14, 2025
సింగరకొండ దేవాలయ స్పెషాలిటీ ఇదే..!

అద్దంకి – సింగరకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో దక్షిణ ముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఇదొక్కటే ఉంది. ఈ దేవాలయం 1960 నుంచి దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు.
Similar News
News March 19, 2025
KMR: ఆత్మవిశ్వాసం ఉంటే అద్భుతాలు సాధిస్తారు: కలెక్టర్

దివ్యాంగ విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ఉంటే జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. సమగ్ర శిక్షా కామారెడ్డి జిల్లా, భారతీయ దివ్యాంగుల పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ శిబిరాన్ని కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 207 మంది దివ్యాంగులకు ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు.
News March 19, 2025
నాకు రక్షణ కల్పించండి: వివేకా హత్య కేసు నిందితుడు

AP: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కడప SPని కలిసి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ హత్య కేసులో నిందితులు జైల్లో నన్ను బెదిరించారు. నేను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చట్లేదు. వైసీపీకి చెందిన కొందరు నన్ను బెదిరిస్తున్నారు. ‘హత్య’ సినిమాలో నన్ను క్రూరంగా చిత్రీకరించారు. ఆ మూవీలో నలుగురే చంపినట్లు చూపించారు. 8మందిని ఎందుకు చూపించలేదు?’’ అని ప్రశ్నించారు.
News March 19, 2025
బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధమవ్వండి: కలెక్టర్

మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. త్వరలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్‌పై బుధవారం తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గతంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్రతో చర్చించి త్వరలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ తేదీలను ప్రకటిస్తామన్నారు.