News October 25, 2024

సింగరాయకొండ: జల్సాలకు అలవాటు పడి.. కటకటాల పాలయ్యారు

image

జల్సాలకు అలవాటు పడి ఐదుగురు యువకులు కటకటాల పాలయ్యారు. దొంగతనాలు, గంజాయి అమ్మకాలు చేసి జల్సాలు చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి 13 బైక్‌లు, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ హజరత్తయ్య తెలిపారు. గురువారం రాత్రి సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరు పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చారని సీఐ పేర్కొన్నారు. ఇలా తప్పుడు దారుల్లో నడవద్దని సూచించారు.

Similar News

News November 15, 2025

ప్రకాశం జిల్లాకు 2 రోజులు పాటు మోస్తరు వర్షసూచన

image

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం అధికంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.

News November 15, 2025

ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

image

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.

News November 14, 2025