News March 22, 2024
సింగరాయకొండ: ముగ్గురు వాలంటీర్లపై వేటు
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ముగ్గురు వాలంటీర్లపై తొలగింపులు కొనసాగుతున్నాయి. బుధవారం సింగరాయకొండలో మంత్రి సురేశ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పొన్నూరి సురేశ్, సిరిమల్లె మణికంఠ, దేపూరి శివయ్య పాల్గొన్నారు. దీనిపై అధికారులు స్పందించి.. విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో నగేశ్ కుమారి చెప్పారు. ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో తొలగింపులు జరిగాయి.
Similar News
News September 14, 2024
ప్రకాశం జిల్లా TODAY TOP NEWS
*బాలినేని<<14089340>> పార్టీ మార్పుపై<<>> మరోసారి చర్చ
*అర్ధవీడు: 15 మంది వైసీపీ వర్గీయులపై కేసు
*ఈ నెల 18న దర్శిలో జాబ్ మేళా
*చీరాల:108లో పైలెట్ & డ్రైవర్ ఉద్యోగాలు
*దోర్నాల మాజీ ZPTCపై అవినీతి ఆరోపణలు
*మార్కాపురం: చెరువు స్థలాలను ఆక్రమిస్తే చర్యలు
* అర్ధవీడు: మైనర్ బాలుడికి మూడేళ్లు జైలు శిక్ష
*యర్రగొండపాలెం వినాయక ఊరేగింపులో ఘర్షణ
* మార్కాపురం: కరెన్సీ నోట్లతో దర్శనమిస్తున్న గణేషుడు
News September 13, 2024
ప్రకాశం: మైనర్ బాలుడికి మూడేళ్ల జైలుశిక్ష
ప్రకాశం జిల్లా అర్ధవీడుకు చెందిన ఓ మైనర్ బాలుడికి ఒంగోలు కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. 2018లో ఏడవ తరగతి చదువుతున్న బాలుడిని ఇంటర్ విద్యార్థినికి ప్రేమలేఖ ఇవ్వాలంటూ నిందితుడు ఒత్తిడి చేశాడు. దీంతో ప్రేమలేఖ ఇవ్వనన్న విద్యార్థిపై మైనర్ బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలుడు మృతి చెందాడు. విచారణ అనంతరం ఒంగోలు కోర్టు నేడు నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
News September 13, 2024
ప్రకాశం: 108లో డ్రైవర్& పైలట్ ఉద్యోగాలు
104,108 వాహనాల్లో డ్రైవర్లు & పైలట్స్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాపట్ల 104 జిల్లా మేనేజర్ జె నాగేశ్వరరావు తెలిపారు. డ్రైవర్& పైలట్ 10వ తరగతి ఉత్తీర్ణత, హెవీ లైసెన్స్, 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండి, ఇంగ్లిష్ చదవడం & రాయడం తెలిసి ఉండాలన్నారు. అర్హులైన వారు Sep 16వ తేదీలోపు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో 104 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.