News June 30, 2024
సింగరాయకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలకుంట్లపాడులో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో రాజమండ్రికి చెందిన షేక్ జానీ(40) మృతి చెందాడని ఎస్సై శ్రీరామ్ ఆదివారం తెలిపారు. 5 సం. క్రితం వలస వచ్చి అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ రొయ్యల పరిశ్రమంలో కూలీగా పని చేస్తున్నాడన్నారు. రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢీకొట్టడంతో అదే వాహనం ముందు చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News January 9, 2026
ప్రకాశం: రుణాలు పొందిన వారికి గుడ్ న్యూస్

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే అర్జున్ నాయక్ కీలక సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన వారు కొవిడ్-19 కారణంగా గతంలో రుణాలు చెల్లించలేదన్నారు. అటువంటి వారి కోసం ప్రస్తుతం వడ్డీ రద్దుతో నగదు చెల్లించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 30లోగా రుణాలు వడ్డీ లేకుండా చెల్లించి రుణాలను మాఫీ చేసుకోవచ్చన్నారు.
News January 8, 2026
సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలి: కలెక్టర్

రవాణా శాఖలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ప్రవర్తన, ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా ఉండాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో రవాణా శాఖపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలన్నారు.
News January 8, 2026
త్వరగా స్థలాలను గుర్తించాలి: ప్రకాశం కలెక్టర్

ఎంఎస్ఎంఈ పార్కులకు త్వరగా స్థలాలను గుర్తించాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు సైతం తగిన స్థలాలను గుర్తించాలన్నారు.


