News April 1, 2025
సింగరేణి ఆర్థికంగా ముందుకెళ్లాలి: శ్రీరాంపూర్ జీఎం

సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత ముందుకు సాగాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. జీఎం కార్యాలయంలోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా లక్ష్మిపూజ నిర్వహించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులందరిపైనా ఉండాలని కోరారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెరగాలని కోరారు.
Similar News
News September 16, 2025
జగిత్యాల: ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్లో గల ఈవీఎం గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించారు. గోదాం వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ట భద్రతతో ఉండాలని, అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, ఆర్డీవో మధుసూదన్ తదితరులున్నారు.
News September 16, 2025
పుట్ట మధు ఇంటి ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఇంటి ముందు మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పెంచికల్ పేట గ్రామంలో సోమవారం స్వర్గీయ శ్రీపాద రావు, మంత్రి శ్రీధర్ బాబుపై పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. అనంతరం పుట్ట మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఇదే క్రమంలో అంబేడ్కర్, శ్రీపాద రావు విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేశారు.
News September 16, 2025
పాక్కు అవమానం.. మాట ప్రకారం తప్పుకుంటుందా?

IND vs PAK మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ను తొలగించాలని PCB చేసిన <<17717948>>ఫిర్యాదును<<>> రిజెక్ట్ చేసినట్లు ICC అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకుంటామన్న పాక్కు ఘోర అవమానం ఎదురైంది. మొన్న గ్రౌండ్లో ప్లేయర్లకు, ఇప్పుడు ఆ దేశ బోర్డుకు భంగపాటు తప్పలేదు. మాట మీద నిలబడి టోర్నీ నుంచి తప్పుకుంటే పాక్కు కనీస మర్యాదైనా దక్కుతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.