News February 10, 2025

సింగరేణి ఇంటర్వ్యూకు బెల్లంపల్లి రీజియన్ అధికారులు

image

సింగరేణి సంస్థల డైరెక్టర్లు (P& P), డైరెక్టర్(ఆపరేషన్)పోస్టుల ఎంపికకు రంగం సిద్ధమైంది. డైరెక్టర్ల ఎంపిక కోసం పలువురు GMలకు ప్రభుత్వం, CMDబలరాం నాయక్ నుంచి పిలుపు వచ్చింది. బెల్లంపల్లి రీజియన్‌లో పనిచేస్తున్న శ్రీరాంపూర్ GM సూర్యనారాయణ, మందమర్రి GM దేవేందర్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ GM రఘుకుమార్‌కు సోమవారం మధ్యాహ్నం ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉంది.

Similar News

News November 20, 2025

GWL: ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి- కురువ పల్లయ్య

image

స్టూడెంట్‌ను మోకాళ్లపై నడిపించి గాయాలు అయ్యేందుకు కారణమైన వడ్డేపల్లి మండలంలోని శారద విద్యానికేతన్ గుర్తింపును రద్దు చేయాలని BRSV గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. గురువారం గద్వాలలో మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో వేలకు వేలు ఫీజు చెల్లించి, విద్యాబుద్ధులు నేర్పమని పంపితే అనాగరికంగా విద్యార్థులను ఇబ్బందికి గురి చేయడమేంటంటూ ప్రశ్నించారు.

News November 20, 2025

వరంగల్: పోలీస్ సిబ్బందికి రేపు ఉచిత వైద్య శిబిరం

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రేపు (శుక్రవారం) ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రముఖ వైద్య నిపుణుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ (సీపీ) సన్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు.

News November 20, 2025

సంగారెడ్డి: రేపటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో రేపటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. ఈ నెల 21, 22 తేదీల్లో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు, 24, 25 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంఈవోలకు సూచించారు.