News June 20, 2024
సింగరేణి తెలంగాణకే తలమానికం: భట్టి
సింగరేణి ఉద్యోగాల గని, తెలంగాణకే తలమానికం అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో 42 వేలమంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారని, 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారన్నారు. రాష్ట్రంలో 40 గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగుతుందని స్పష్టం చేశారు.
Similar News
News September 13, 2024
ఖమ్మం: ‘ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు’
ఈనెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, డి.మధుసూదన్ నాయక్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు.
News September 13, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజులు సెలవు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజుల సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో వారంతపు సెలవులు కాగా, 16న వినాయక నిమజ్జనం, 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా వరుసగా 4 రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తిరిగి ఈనెల 18వ తేదీ బుధవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
News September 13, 2024
TGSRTC డిపో మేనేజర్లతో రీజనల్ మేనేజర్ సమీక్ష
ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరి రామ్ గురువారం రీజనల్ కార్యాలయంలో అన్ని డిపోల మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వర్షాల వల్ల క్యాన్సిల్ అయిన బస్సుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దసరా స్పెషల్ ఆపరేషన్ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్ని డిపోలో ట్రాఫిక్ ఇన్‌ఛార్జ్‌లు, గ్యారేజ్ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.