News July 17, 2024
సింగరేణి బొగ్గు గనులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు

సచివాలయంలో సింగరేణి అధికారులతో బొగ్గు గనులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో నాలుగు నెలల్లో ఒడిశా నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలన్నారు. సింగరేణి తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి … రాష్ట్ర ప్రభుత్వ, కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని, స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు.
Similar News
News December 3, 2025
ఖమ్మం: అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు

ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల దాఖలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు దాఖలు చేశారు. 6 మండలాల్లో మొత్తం 183 గ్రామపంచాయతీలకు గాను 1055 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 1686 వార్డులకు గాను 4160 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కూసుమంచి మండలంలో అత్యధికంగా సర్పంచ్ పదవికి 250 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.
News December 3, 2025
ఖమ్మం సర్కారీ స్కూళ్ల అద్భుత ప్రదర్శన, కలెక్టర్ ప్రశంసలు

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ విద్య ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల నైపుణ్యాలు తోడవ్వాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. స్వచ్ఛ హరిత విద్యాలయాల సర్వేలో అద్భుత ప్రతిభ కనబరిచి, అత్యధిక స్కోర్ సాధించిన 8 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కలెక్టర్ ప్రశంసపత్రాలు అందించి అభినందించారు. ఈ విజయం జిల్లాకు గర్వకారణం అని కలెక్టర్ తెలిపారు.
News December 3, 2025
ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి 29 మంది సీనియర్ రెసిడెంట్లు

ఖమ్మం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రికి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శుభవార్త అందించింది. తాజాగా 29 మంది సీనియర్ రెసిడెంట్లను కేటాయించింది. పీజీ పూర్తి చేసిన ఈ నిపుణులైన వైద్యులు, సంవత్సరం పాటు అత్యవసర విభాగాలతో సహా జనరల్ ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో సేవలు అందిస్తారు. ఈ నియామకాలతో ఖమ్మం ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుంది.


