News December 23, 2024
సింగరేణి వేడుకలకు ముస్తాబైన స్టేడియం
సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంను అందంగా ముస్తాబు చేశారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు GM లలిత కుమార్ తెలిపారు. సింగరేణి జెండా ఆవిష్కరణ, స్టాల్స్ ఏర్పాట్లను జీఎంతో పాటు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సింగరేణి కుటుంబాలు, స్థానికులు హాజరు కావాలన్నారు.
Similar News
News December 23, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,43,740 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.72,782, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.56,640, అన్నదానం రూ.14,318 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
News December 23, 2024
నేటితో 136వ వసంతంలోకి సింగరేణి
సింగరేణి అంచెలంచలుగా ఎదుగుతూ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. నేడు 135 వసంతాలు పూర్తిచేసుకుని 136వ వసంతంలోకి అడిగెడుతోంది. రామగుండంలో 1937 సంవత్సరంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మొదటగా హైదరాబాద్ దక్కన్ కంపెనీతో ఏర్పాటైన ఈ సంస్థ.. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా పేరు మార్చారు. అప్పటినుంచి ప్రతియేటా డిసెంబర్ 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
News December 23, 2024
సింగరేణి దేశానికి వెలుగులు రాష్ట్రానికి గర్వకారణం: సీఎం
తెలంగాణ మణి కిరీటం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి, ప్రగతి పథంలో సాగుతూ దేశానికి వెలుగులు నింపుతుండటం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. సింగరేణి మరో శత వసంతాలు ఉజ్వలంగా దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు.