News August 6, 2024
సింగరేణి సంస్థలో పలువురు అధికారుల బదిలీ
సింగరేణి సంస్థలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కార్పొరేట్ జీఎం ఎం.సుభాని, భూపాలపల్లి జీఎం డి.రవిప్రసాద్, మందమర్రి జిఎం ఎ.మనోహర్, ఆర్జీ వన్ జీఎం చింతల శ్రీనివాస్, మార్కెటింగ్ జిఎం జి. దేవేందర్, కార్పొరేట్ జిఎం సుశాంత సాహ, మణుగూరు జిఎం డి. లలిత్ కుమార్, అర్జీ వన్ ఏజెంట్ బానోతు సైదులు, శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే గ్రూప్ ఏజెంట్ ఎం.శ్రీనివాస్ బదిలీ అయ్యారు.
Similar News
News September 11, 2024
కాంగ్రెస్ నేతను పరామర్శించిన బీజేపీ ఎంపీ
ఏఐసీసీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు జాదవ్ నరేష్‌ను అదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం గణేష్ పరామర్శించారు. గుడిహత్నూర్ మండలం తోషం తండ కు చెందిన జాదవ్ నరేష్ అన్నయ్య జాదవ్ చందూలాల్ ఇటీవల మృతి చెందారు. విషషయం తెలుసుకున్న ఎంపీ నరేష్ కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించి, మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ఎంపీ వెంట
బీజేపీ నాయకులు వామన్ గిత్తే, చంద్రకాంత్, నారాయణ తదితరులు ఉన్నారు.
News September 10, 2024
ADB: ‘క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు’
క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 10 ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక రిమ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు. ఆత్మహత్యలకు పాల్పడటం వల్ల వారి కుటుంబాలు చిన్న భిన్నమవుతాయన్నారు. ఉచిత కౌన్సెలింగ్ కొరకు 14416 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News September 10, 2024
ADB: నోటితో విషం తీసి విద్యార్థి ప్రాణం కాపాడిన టీచర్
విద్యార్థిని పాము కాటేయడంతో వెంటనే ఓ ఉపాధ్యాయుడు నోటితో విషం తొలగించి విద్యార్థి ప్రాణాన్ని కాపాడాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ధనోర ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 1వ తరగతి విద్యార్థి యశ్వంత్‌ని పాము కాటేసింది. వెంటనే ఉపాధ్యాయుడు సురేశ్ నోటితో విషం తీసేసి విద్యార్థి ప్రాణం కాపాడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆయన్ను పలువురు అభినందించారు.