News August 13, 2024
సింగిల్ యూజ్ కవర్లు వాడితే రూ.10వేలు ఫైన్: మున్సిపల్ కమిషనర్

వ్యాపార సముదాయ యాజమాన్యాలు, దుకాణదారులు ఉపయోగించే సింగిల్ యూజ్ కవర్లపై నిషేధం విధించినట్లు చండూరు మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తే రూ.10వేల జరిమానా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అరుణా కుమారి, శానిటరీ ఇన్స్పెక్టర్ సాయి, అరవింద్ పాల్గొన్నారు.
Similar News
News November 5, 2025
శివ నామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు

నల్గొండ జిల్లాలో కార్తీక మాసం కొనసాగుతుంది. దీంతో ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. జిల్లాలో చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామీ, పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంతో పాటు వివిధ ఆలయాలకు భక్తులు ఉదయమే పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయాలు దీపాల కాంతులతో, శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
News November 5, 2025
NLG: 4400 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

నల్గొండ జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లుల పరిధిలో L-1 కింద ఉన్న 9 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్లు మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి తెలిపారు. ఇప్పటివరకు 4400 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12% తేమ ఉండడంతో పాటు కపాస్ కిసాన్ అనే యాప్లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు మాత్రమే స్లాట్ ఆధారంగా పత్తిని కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకురావాలని సూచించారు.
News November 5, 2025
NLG: కలకలం రేపుతున్న మహిళల అదృశ్యం ఘటనలు

జిల్లాలో మహిళల అదృశ్యం ఘటనలు కలకలం రేపుతుంది. తిప్పర్తి పీఎస్ పరిధిలో కాజీరామారం గ్రామానికి చెందిన కందుకూరి సౌజన్య(24), చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన వివాహిత మంకాల రేణుక(35)లు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరూ కూడా వివాహితులే కావడం విశేషం.


