News February 12, 2025
‘సింగిల్ విండో పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించాలి’

సింగిల్ విండో పాలకవర్గాల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించాలని మహబూబ్ నగర్ పీఎసీఎస్ ఛైర్మన్లు డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డికి బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీఎసీఎస్ చైర్మన్లు మాట్లాడుతూ సర్పంచులు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ల పాలకవర్గం ముగియగానే అధికారుల పాలన మొదలవుతుందని, అధికారుల పాలనలో కంటే ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలను కొనసాగిస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.
Similar News
News March 24, 2025
మహబూబ్‌నగర్: ‘ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలి’

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి భూపాల్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆశా వర్కర్లు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారని, కానీ ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా పోరాటాలను మాత్రం ఆపలేరని భూపాల్ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
News March 24, 2025
MBNR: మాజీ మంత్రి VS MLA.. తగ్గేదేలే..!

మహబూబ్‌నగర్‌లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు మాజీ మంత్రి, BRS మాజీ MLA శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫైర్ అవుతున్నారు. 14 నెలల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేసిందంటున్నారు. మరోవైపు MLA యెన్నెం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. అప్పులు చేసి ఆగం చేసింది BRS వాళ్లే అని కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?
News March 24, 2025
కొడంగల్: విషాదం.. యువకుడి మృతి!

యువకుడు ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడంగల్ పరిధి మద్దూరులో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని గోకుల్ నగర్ వాసి సాయిలు(21) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయంపై తండ్రి మందలించాడని ఈనెల 17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని మద్దూర్ ఎస్ఐ తెలిపారు.