News August 24, 2024
సింగూరు ప్రాజెక్టుకు స్వల్ప వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి స్వల్ప వరద వస్తోంది. శుక్రవారం ఇన్ఫ్లో 1907 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 391 క్యూసెక్కులు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. తాలేల్మ లిఫ్ట్ ఇరిగేషన్కు 31 క్యూసెక్కులు, హెచ్ఎండబ్ల్యూఎస్కు 80 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కోసం 70 క్యూసెక్కులు, వృథాగా 210 క్యూసెక్కుల నీరు వెళ్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 14, 2025
మెదక్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావును ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే రక్తదాన శిబిరంపై చర్చించారు. పోలీస్ హెడ్ క్వార్టర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
News October 14, 2025
రామాయంపేట: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి’

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. రామాయంపేట మండలం కోనాపూర్లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం నిర్మాణం చేపడితే సకాలంలో బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు.
News October 14, 2025
రామాయంపేట: గిట్టుబాటు ధర కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రామాయంపేట మండలం కోనాపూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు.