News July 23, 2024
సింగూర్‌కు కొనసాగిన 564 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

సంగాడి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు చేరుతోందని ప్రాజెక్టు ఏఈ మైపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 564 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోందని, 391 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో తాలేల్మకు 41 క్యూసెక్కులు, హైదరాబాద్ వాటర్ సప్లైకి 80, మిషన్ భగీరథ 70, ఆవిరిగా 200 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉందన్నారు.
Similar News
News December 2, 2025
మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

MDK: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిషేధం: ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలు ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు, రాస్తారోకోలు నిషేధమని, చట్టవ్యతిరేక, అశాంతి సృష్టించే చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసుల చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.