News May 3, 2024
సింహపురి నుంచి ఢిల్లీ వెళ్లేది ఎవరో..!

రాజకీయ చైతన్యానికి మారుపేరైన సింహపురిలో రసవత్తర పోటీ జరుగుతోంది. నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి విజయసాయిరెడ్డి(వైసీపీ), వీపీఆర్(టీడీపీ), రాజు(కాంగ్రెస్) పోటీపడుతున్నారు. నెల్లూరు అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టోతో వీఎస్ఆర్, మాస్టర్ ప్లాన్తో వీపీఆర్, గతంలో చేసిన మంచి పనులతో రాజు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు సింహపురి ప్రజలు ఎవరిని ఢిల్లీకి పంపుతారో చూడాలి మరి.
Similar News
News October 28, 2025
నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీలు, జానియర్ కళాశాలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. విధిగా సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 28, 2025
శ్రీహరికోట: షార్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నందు సైంటిస్ట్/ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ – బి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. వివిధ విభాగాలలో మొత్తం 141 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://apps.shar.gov.in/sdscshar/result1.jsp వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 11.
News October 28, 2025
నెల్లూరులో విద్యార్థుల మిస్సింగ్.. గూడూరులో ప్రత్యక్షం

ధనలక్ష్మిపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న రాకేష్, లోకేష్ ఈ నెల 23న అదృశ్యమయ్యారు. ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. వారిద్దరూ గూడూరులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్లిన ఆ ఇద్దరు విద్యార్థులు గూడూరులో ఉండగా.. సాంకేతికత ఆధారంగా వారిని పోలీసులు గుర్తించారు.


