News April 7, 2025
సింహపురి ప్రీమియం లీగ్ ప్రారంభం

నెల్లూరు సమీపంలోని బుజబుజ నెల్లూరు సీఐఏ క్రికెట్ అకాడమీలో సింహపురి ప్రీమియర్ లీగ్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్ పి.విజయ్‌కుమార్, మదీనా ఇంతియాజ్ తదితరులు హాజరయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ గూడూరు జట్టు 19.2 ఓవర్లలో 10 వికెట్లకు 139 పరుగులు సాధించింది. ఆత్మకూర్ రేంజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు సాధించి ఓడిపోయింది.
Similar News
News April 18, 2025
నెల్లూరు కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నందన్

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ బదిలీ అయిన విషయం తెలిసిందే. నూతన కమిషనర్‌గా ఇంకా ఎవరిని నియమించలేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ అదనపు కమిషనర్ నందన్‌ను ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News April 18, 2025
నెల్లూరు: ఒకేసారి రూ.5వేలు పెరిగిన ధర

నెల్లూరు జిల్లాలో కొంతమేర నిమ్మ ధరలు పెరిగాయి. పొదలకూరు మార్కెట్‌లో లూజు బస్తా శుక్రవారం రూ.7వేల నుంచి రూ.9వేలు పలికింది. మంచు ప్రభావం తగ్గి వేసవితాపం పెరగడంతో ఢిల్లీలో మార్కెట్ ఊపందుకుంది. 15 రోజుల కిందట రూ.4,500 ఉన్న ధర ఒకేసారి రూ.5 వేలు పెరిగి రూ.9వేలకు చేరింది. దీంతో రైతులు చెట్లకు ఉన్న కాయలు జాగ్రత్తగా కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. చెన్నై, బెంగళూరు, కేరళకు తరలిస్తున్నారు.
News April 18, 2025
నెల్లూరు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి: యువరాజ్

అధికారులు సమన్వయంతో పనిచేసి నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ యువరాజ్ అధికారులకు సూచించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లో ఆయన కలెక్టర్ ఆనంద్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా మాత్రమే రెవెన్యూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అన్నారు.