News December 4, 2024
సింహాచలంలో డిసెంబర్‌లో జరిగే ముఖ్య ఉత్సవాలు
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో 2024 డిసెంబర్ నెలలో నిర్వహించబోయే ఉత్సవాలను అధికారులు వెల్లడించారు.11న స్వర్ణ తులసీదళార్చనం, గీతాజయంతి, గ్రామ తిరువీధి, 12న స్వర్ణ పుష్పార్చనం, నృసింహ దీక్ష ప్రారంభం. 13నశ్రీ తాయార్ సన్నిధిని సహస్రనామార్చనం, కృత్తిక, తిరుమంగైయాళ్వార్ తిరునక్షత్రం,14న శ్రీ స్వామివారి మాస జయంతి16న నెలగంటు జయంతి కార్యక్రమాల నిర్వహించనున్నారు.
Similar News
News January 23, 2025
మోడల్ సిటీగా విశాఖను తీర్చిదిద్దాలి: ఆమ్రపాలి
విశాఖ మహానగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. గురువారం వీఎంఆర్డీఏలో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. డీపీఆర్‌లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు.
News January 23, 2025
విశాఖ: వలస వచ్చి విగత జీవులయ్యారు..!
బతుకుతెరువుకు ఊరొదిలి వచ్చిన ఆ దంపతులను లారీ రూపంలో మృత్యువు వెంటాడడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. <<15222234>>అగనంపూడి <<>>టోల్‌గేట్ వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15225242>>మృతి చెందిన <<>>గొర్లి మన్మథరావు, అరుణకుమారి దంపతులు పార్వతీపురం జిల్లా నుంచి రెండేళ్ల క్రితం వలస వచ్చారు. మన్మథరావు ఫార్మాసిటీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు నిఖిల్, కూతురు నీలిమను కర్రివానిపాలెం హైస్కూల్‌లో చదివిస్తున్నారు.
News January 23, 2025
అనకాపల్లి: ఆర్ఈసీఎస్ పర్సన్ ఇన్‌ఛార్జిగా కలెక్టర్
గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ(ఆర్ఈసీఎస్) పర్సన్ ఇన్‌ఛార్జిగా అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర కో-ఆపరేటివ్ అండ్ రిజిస్ట్రార్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం తనను పర్సన్ ఇన్‌ఛార్జిగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార ఆడిట్ అధికారిణి ఎం.శ్యామల, ప్రాజెక్ట్ ఇంజినీర్ జె.ప్రసాదరావు పాల్గొన్నారు.