News June 26, 2024

సింహాచలంలో వెంకటేశ్ సినిమా స్క్రిప్ట్‌‌కి పూజలు

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామిని తెలుగు సినీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం..'(వర్కింగ్ టైటిల్) సినిమా స్క్రిప్ట్‌కి సంబంధించిన పూజలు చేశారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం అందించారు.

Similar News

News December 1, 2025

స్టీల్ ప్లాంట్ ఘటనపై విచారణకు ఏఐటీయూసీ డిమాండ్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ కన్వేయర్ బెల్ట్ ఘటనపై సీఎండీని విధుల నుంచి దూరంగా ఉంచి, నిపుణులతో జాయింట్ విచారణ జరిపించాలని ఏఐటీయూసీ నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం లోపం వల్లే బెల్టు తెగిందని, ఉద్యోగులపై నిందలు వేయడం తగదని జిల్లా కార్యదర్శి జి.ఎస్.జె.అచ్యుత రావు మండిపడ్డారు. తప్పుడు మరమ్మతుల వల్లే ప్రమాదం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.

News December 1, 2025

విశాఖ: ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్

image

విశాఖపట్నం జిల్లా పరిషత్‌లో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వారి స్వయం ఉపాధి కోసం మహిళలకు కలెక్టర్ చేతుల మీదుగా కుట్టు మిషన్‌లు అందించారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన చిన్నారులతో కలసి కలెక్టర్ అల్పాహారం తీసుకున్నారు. చిన్నారులతో మాట్లాడి వారి చదువు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

News December 1, 2025

పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని డిమాండ్

image

సింహాచలం దేవస్థాన పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని నిర్వసితులు డిమాండ్ చేశారు. ఆదివారం సింహాచలంలో నిర్వసితులు ధర్నా నిర్వహించారు. పంచగ్రామాల సమస్య హైకోర్టులో కేసు ఉందన్న కారణంతో ప్రభుత్వాలు ఏళ్ల తరబడి సమస్యను పరిష్కరించడంలేదన్నారు. గూగుల్ డేటా సెంటర్, ఐటీ కంపెనీల కోసం వందల ఎకరాల దేవస్థానం భూములను కట్టబెడుతున్నారని, పంచ గ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం కనీసం చర్చించడం లేదని మండిపడ్డారు.