News April 27, 2024

సింహాచలంలో సుప్రభాత సేవ టికెట్లు పునఃప్రారంభం

image

సింహాచలం శ్రీ వరహ లక్ష్మి నృసింహ స్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు సందర్భాన్ని పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత రద్దు చేసిన దర్శనాలను కూడా పునః ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.

Similar News

News October 1, 2024

అండర్‌-17 రాష్ట్రస్థాయి పోటీలు: ఖోఖోలో విజేతగా విశాఖ జట్టు

image

వినుకొండ లయోలా హైస్కూల్లో జరుగుతున్న అండర్‌-17 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. ఖోఖోలో విశాఖ జట్టు విజేతగా నిలవగా, రన్నరప్‌ స్థానాన్ని అనంతపురం దక్కించుకుంది. ఫుట్‌బాల్‌లో వైఎస్‌ఆర్‌ కడప విజయం సాధించగా.. చిత్తూరు జట్టు రెండో స్థానంలో నిలిచింది. బాల్‌బ్యాడ్మింటన్‌లో గుంటూరు జిల్లా జట్టు గెలుపొందింది. విజేతలకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బహుమతులను ప్రదానం చేశారు.

News October 1, 2024

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అరకు కాఫీ

image

అంతర్జాతీయ కాఫీ డే సంధర్బంగా.. కాఫీ అంటే గుర్తొచ్చే మన బ్రాండ్‌ అరకు కాఫీ. దీనికి అంతర్జాతీయంగా మంచి మార్కెట్‌ ఉంది. ప్రధాని మోదీ సైతం అరకు కాఫీని మెచ్చుకున్నారు. ఏజెన్సీలో అటవీశాఖ, కాఫీ బోర్డు కలిసి 1970లో సాగును ప్రారంభించింది. 1974 నుంచి ITDA రైతులతో కాఫీ పంట సాగును ప్రారంభించింది. ప్రస్తుతం పాడేరు రెవెన్యూ డివిజన్‌లో 1.40 లక్షల ఆదివాసీ కుటుంబాలు 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతున్నారు.

News October 1, 2024

స్టీల్ ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన సక్సేనా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఏ.కే.సక్సేనా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ సీఎండీగా పనిచేస్తున్న సక్సేనా స్టీల్ ప్లాంట్ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్లాంట్ డైరెక్టర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. తర్వాత కర్మాగారాన్ని సందర్శించారు.