News April 2, 2025
సింహాచలం అప్పన్న రథసారథికి ఆహ్వానం

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈనెల 8న జరగనుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ సహాయక కార్యనిర్వాహణాధికారి ఆనంద్ కుమార్ రథోత్సవానికి రథసారథి అయిన కదిరి లక్ష్మణరావును తన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కదిరి లక్ష్మణరావు వంశానికి చెందిన వారే దశాబ్దాలుగా రథోత్సవం సారథిగా ఉండడం అనవాయితీ.
Similar News
News April 10, 2025
దంతెవాడ వరకే కిరండూల్ ఎక్స్ప్రెస్

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502) ఈనెల 14 నుంచి 22 వరకు అరకు-విశాఖ మధ్య నడుస్తుందని వాల్తేర్ DCM సందీప్ తెలిపారు. విశాఖ నుంచి బయలుదేరే కిరండూల్ నైట్ ఎక్స్ప్రెస్(18515/18516) ఈనెల 15 నుంచి 22 వరకు దంతెవాడకు తిరిగి 16 నుంచి 23 మధ్యలో విశాఖకు బయలుదేరుతుందన్నారు. డార్లిపుట్-పాడువా స్టేషన్ల పునర్నిర్మాణం, భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు.
News April 10, 2025
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో బుధవారం రెవెన్యూ వర్క్ షాప్ నిర్వహించారు. రెవెన్యూ పరమైన అన్ని అంశాలపై, ప్రభుత్వ జీవోలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆక్రమణల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్లో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు.
News April 9, 2025
విశాఖలో రేపు మాంసం దుకాణాలకు సెలవు

మహావీర్ జయంతి సందర్భంగా జీవీఎంసీ పరిధిలో గురువారం మాంసం దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ నగర పశు నియంత్రణాధికారి డాక్టర్ ఎన్.కిషోర్ బుధవారం తెలిపారు. కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు రేపు జంతువధ, మాంస విక్రయాలు నిషేధం అన్నారు. ఈ నింబదనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.