News April 22, 2024
సింహాచలం అప్పన్న సన్నిధిలో పండిత సదస్సు

సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఆదివారం రాత్రి పండిత సదస్సును వైదిక వర్గాలు సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద పండితులు సింహాద్రి అప్పన్న శ్రీదేవి భూదేవిని కొనియాడుతూ కీర్తించారు. అనంతరం వేద పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి, అదనపు కమిషనర్ చంద్రకుమార్ పాల్గొన్నారు.
Similar News
News April 21, 2025
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో 170 మంది తొలగింపు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మరో 170 మందినియాజమాన్యం తొలగించింది. ఇప్పటివరకు 1500 వరకు ఉద్యోగులను తొలగించారు. అయితే కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో మే 20వరకు ఎటువంటి చర్యలు ఉండవని చెప్పిన యాజమాన్యం తొలగింపులు ఆపడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కాగా ఉన్నపలంగా ఉద్యోగాలు పోవడంతో కార్మికులు బోరున విలపిస్తున్నారు.
News April 21, 2025
ఉమ్మడి విశాఖలో కేటగిరీల వారీగా డీఎస్సీ పోస్టులు ఇలా..

డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాలో 734 పోస్టులు భర్తీ చేయనున్నారు. రోస్టర్ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. OC- 290, BC-A: 53, BC-B: 73, BC-C:7, BC-D:49, BC-E:29, SC గ్రేడ్1- 13, SC గ్రేడ్2- 44, SC గ్రేడ్3- 60, ST- 43, EWS- 73 పోస్టులు కేటాయించారు.
News April 21, 2025
విశాఖ కేంద్రంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్.. నిర్వాహకుల అరెస్ట్

ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప.గో జిల్లా పాలకొల్లుకు చెందిన వెంకటరావు, మురళీలను ఆదివారం పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శ్రీవేద వివరాల మేరకు.. HYD, విశాఖ కేంద్రంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 10 ఫోన్లు, రూ.33,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రధాన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని.. వీరిలో ఒకరు వైసీపీ నేత అని చెప్పారు.