News March 30, 2025
సింహాచలం అప్పన్న సన్నిధిలో పంచాంగ శ్రవణం

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ వారి దేవస్థానంలో ఉగాది ఆస్థానం విశేషంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారిని ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ అలంకారి శ్రీ సీతారామచార్యులు పంచాంగ శ్రవణం చేశారు.ఈ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా పడతాయని, రైతులకు పంటలు సకాలంలో చేతికి అందుతాయన్నారు. అనంతరం దేవస్థానం పంచాంగాలు అందరికీ అందించారు.
Similar News
News April 3, 2025
రికార్డు సృష్టించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసిందని జనరల్ మేజేజర్ పరమేశ్వర్ ఫంక్వాలా తెలిపారు. 259.254 మిలియన్ల టన్నుల సరకు రవాణ చేసి కొత్త బెంచ్మార్క్ను దాటిందని వెల్లడించారు. గతంలో ఉన్న 259 మిలియన్ల టన్నుల మార్కుని దాటిని దేశంలోని మొదటి రైల్వే జోన్గా ECoR అవతరించిందని పేర్కొన్నారు.
News April 3, 2025
బ్యాంకు ప్రతినిధులతో విశాఖ కలెక్టర్ సమావేశం

స్వయం ఉపాధి పొందాలనుకునే అన్ని వర్గాల ప్రజలకు బ్యాంకులు పూర్తి సహకారం అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. పలువురు బ్యాంకు ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశం అయ్యారు. రుణాల మంజూరులో సులభతర విధానాలు పాటిస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి తగిన విధంగా అండగా నిలవాలన్నారు.
News April 3, 2025
బాధ్యతలు చేపట్టిన విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు

విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన వారు గురువారం బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడిగా విజయం సాధించిన ఎమ్.కె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చింతపల్లి ఆనంద్ కుమార్, జనరల్ సెక్రటరీగా పార్వతి నాయుడు, కోశాధికారిగా శ్రీదివ్యష్ భాద్యతలు చేపట్టారు. బార్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. విజయం సాధించిన అధ్యక్ష, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.