News January 13, 2025

సింహాచలం ఆలయంలో నేడు గోదాదేవి కళ్యాణం

image

భోగి పండగ సందర్భాన్ని పరిష్కరించుకొని సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సోమవారం సాయంత్రం గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో త్రినాధరావు తెలిపారు. ఎదురు సన్నాహోత్సవం, కళ్యాణోత్సవ ఘట్టాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా ఉదయం జరగాల్సిన నిత్య కళ్యాణాన్ని గోదాదేవి కళ్యాణంతో జరిపిస్తామన్నారు.

Similar News

News October 13, 2025

సకాలంలో స్పందించిన విశాఖ పోలీసులు

image

కంచరపాలెంకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మహారాణిపేట పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కంచరపాలెంలో నివాసం ఉంటున్న యువతి ఇంట్లో కలహారం కారణంగా ఎవరికి చెప్పకుండా ఆర్కే బీచ్‌కి వచ్చి చనిపోవడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు112కు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీఐ దివాకర్ యాదవ్ స్పందించి గాలింపు చేపట్టగా బీచ్ రోడ్లో సాగర్ తీరం వద్ద ఉన్న యువతని కాపాడారు.

News October 13, 2025

ఆక్రమణకు గురౌతున్న ఏయూ భూములు..!

image

న‌గ‌రంపాలెంలోని ఏయూ 137 ఎకరాల భూమిని ఏయూ వీసీ జి.పి రాజ‌శేఖ‌ర్‌, రిజిస్ట్రార్ రాంబాబు సోమవారం పరిశీలించారు. కొంత భూమి ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురిఅవుతోంద‌ని, మ‌రికొంత స్థ‌లంలో అనధికార రహదారి నిర్మాణం జరుగుతుండటాన్ని గుర్తించారు. ఏయూ భూముల సరిహద్దులను త్వరగా నిర్ధారించాలన్నారు. భూమిని ప‌రిర‌క్షించే విధంగా అవ‌స‌ర‌మైన‌ చర్యలను స‌త్వ‌రం చేపట్టాలని వీసీ అధికారులకు ఆదేశించారు.

News October 13, 2025

ఏయూలో ఆక‌స్మిక త‌నిఖీ చేసీన వీసీ

image

ఏయూలో ప‌లు విభాగాల‌ను వైస్ ఛాన్సెలర్ రాజ‌శేఖ‌ర్ సోమవారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. కార్యాల‌య ప‌నివేళ‌ల్లో సిబ్బంది త‌ప్ప‌నిస‌రిగా విధుల్లో ఉండాల‌ని సూచించారు. విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.అనంతరం ఏయూ డిస్పెన్స‌రీని సంద‌ర్శించారు.ప్ర‌తీ విద్యార్థికి అవ‌స‌ర‌మైన వైద్య‌సేవ‌ల‌ను స‌త్వ‌రం, స‌కాలంలో అందించాల‌ని సూచించారు.