News August 28, 2024
సింహాచలం కొండపైకి ఫ్రీ బస్

శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా సింహాచలంలో 30వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. మహిళలందరూ కలిసి పూజ చేసుకోవడానికి దేవస్థానం అవకాశం కల్పిస్తోందన్నారు. పూజకు అవసరమైన సామగ్రి, పసుపు, కుంకుమ, విడి పువ్వులు, పత్రి ఉచితంగా అందజేస్తామని చెప్పారు. పూజకు వచ్చే మహిళలకు కొండ దిగువ నుంచి పైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు.
Similar News
News October 31, 2025
సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులు అర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం సిరిపురం జంక్షన్ వద్ద గల పటేల్ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.
News October 31, 2025
విశాఖ రైతు బజార్లకు 3 వారాలపాటు సెలవులు లేవు

మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖలోని అన్ని రైతు బజార్లు వచ్చే 3 వారాల పాటు నిరంతరంగా కొనసాగించాలని CEO ఆదేశాలు జారీ చేశారు. వారానికి 7 రోజులు మార్కెట్లు పూర్తిగా ఓపెన్గా ఉంచాలని సూచించారు. ప్రజలకు అవసరమైన కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీని ఆదేశించారు.
News October 31, 2025
విశాఖ: నదిలో గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం

విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలోని గెడ్డలో గురువారం ధనుశ్రీ (13) గల్లంతైన విషయం తెలిసిందే. తండ్రి శ్రీనుతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోయింది. ధనుశ్రీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. కుమార్తె మృతదేహం వద్ద తల్లి రోదన చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.


