News July 18, 2024
సింహాచలం గిరి ప్రదక్షిణ.. రూట్ మ్యాప్ ఇదే

ఈనెల 20న జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి పావంచ వద్ద మొదలుపెట్టి.. అడవివరం-ధారపాలెం-ఆరిలోవ-హనుమంతువాక-పోలీసు క్వార్టర్స్- కైలాసగిరి టోల్ గేట్- అప్పుఘర్ జంక్షన్- MVPడబుల్ రోడ్-వెంకోజీపాలెం- HB కాలనీ-కైలాసపురం-మాధవధార-మురళీనగర్-బుచ్చిరాజుపాలెం-లక్ష్మీ నగర్-ఇందిరా నగర్- ప్రహ్లాదపురం-గోశాల జంక్షన్-తొలి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం చేరుకోవాలి. సుమారు 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేయాలి. >Share it
Similar News
News November 28, 2025
మహాత్మా జ్యోతిరావ్ ఫూలేకు నివాళులర్పించిన విశాఖ కలెక్టర్

మహాత్మా జ్యోతిరావ్ ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం నౌరోజీ రోడ్డులోని ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఫూలే చేపట్టిన సామాజిక సంస్కరణలు, సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఫూలే అణగారిన కులాల అభ్యున్నతికి, స్త్రీ జనోద్ధరణకు విశేష సేవలు చేశారన్నారు.
News November 28, 2025
రేపు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించే నేవీ డే ముందస్తు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. శనివారం సాయంత్రం సముద్రికలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. డిసెంబర్ 4న నేవీ డేకి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు విశాఖలో చేపట్టారు. పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి షీలా నగర్.. మారుతీ జంక్షన్ మీదుగా ఈస్టర్న్ నావల్ కమాండ్కు చేరుకుంటారు.
News November 28, 2025
శ్రీహరిపురంలో యువకుడు ఆత్మహత్య

శ్రీహరిపురంలోని తన ఇంట్లో ఓ యువకుడు వంశీ ఫ్యానుకు ఊరివేసుకుని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాపురం సీఐ గొల్లగాని అప్పారావు తెలిపారు.


