News July 18, 2024
సింహాచలం గిరి ప్రదక్షిణకు అనువంశిక ధర్మకర్తకు ఆహ్వానం

ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న సింహగిరి ప్రదక్షిణ ఉత్సవానికి హాజరు కావాలని ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ మంత్రి అశోక గజపతి రాజును దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి ఆహ్వానించారు. ఈ మేరకు విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఆయనను కలిసి ఉత్సవ ఏర్పాట్లను వివరించారు. అలాగే ఆషాఢ పౌర్ణమి సందర్భంగా 21న ఆలయంలో జరిగే చందన సమర్పణ వైదిక కార్యక్రమాలను తెలియజేశారు.
Similar News
News November 28, 2025
శ్రీహరిపురంలో యువకుడు ఆత్మహత్య

శ్రీహరిపురంలోని తన ఇంట్లో ఓ యువకుడు వంశీ ఫ్యానుకు ఊరివేసుకుని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాపురం సీఐ గొల్లగాని అప్పారావు తెలిపారు.
News November 27, 2025
విశాఖ: అవినీతి పోలీసుల వేటకు రంగం సిద్ధం?

విశాఖలోని పోలీస్ శాఖలో అవినీతిపై సీరియస్ అయిన CP శంఖబ్రత బాగ్చీ భారీగా బదిలీలు చేపట్టారు. ఇటీవల నలుగురు SIలను బదిలీ చేసిన ఆయన, నేడు మరో 37 మంది ASIలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుళ్లను ఒకేసారి బదిలీ చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది అవినీతి, నెల మామూలు వసూళ్లు, నేరస్తులకు సమాచారం చేరవేయడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో సీఐలపై కూడా వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
News November 27, 2025
విశాఖ: వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి రాబిస్ వ్యాధి రాకుండా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ను గురువారం వేశారు. జీవీఎంసీ పరిధిలో 50 మంది వీధి కుక్కలను పట్టుకునే సిబ్బందికి, శస్త్ర చికిత్సలు నిర్వహించే వారికి వ్యాక్సిన్ వేశారు. వీధి కుక్కలను పట్టుకునేటప్పుడు,శస్త్ర చికిత్సలు నిర్వహించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రవర్తించి పట్టుకోవాలని కమిషనర్ ఆదేశించారు.


