News July 18, 2024
సింహాచలం గిరి ప్రదక్షిణ.. రూట్ మ్యాప్ ఇదే
ఈనెల 20న జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి పావంచ వద్ద మొదలుపెట్టి.. అడవివరం-ధారపాలెం-ఆరిలోవ-హనుమంతువాక-పోలీసు క్వార్టర్స్- కైలాసగిరి టోల్ గేట్- అప్పుఘర్ జంక్షన్- MVPడబుల్ రోడ్-వెంకోజీపాలెం- HB కాలనీ-కైలాసపురం-మాధవధార-మురళీనగర్-బుచ్చిరాజుపాలెం-లక్ష్మీ నగర్-ఇందిరా నగర్- ప్రహ్లాదపురం-గోశాల జంక్షన్-తొలి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం చేరుకోవాలి. సుమారు 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేయాలి. >Share it
Similar News
News December 1, 2024
మైనింగ్ కంపెనీపై చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎంకు లేఖ
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో నిర్వహిస్తున్న అత్యం మైనింగ్ ప్రైవేట్ కంపెనీపై చర్యలు చేపట్టాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ కోరారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. మండలంలోని 10 గ్రామాలలోని కొండలను మైనింగ్ కంపెనీ ఆక్రమిస్తుందని అన్నారు. దీనిపై ప్రశ్నించిన ఆయా గ్రామ ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో మైనింగ్ కంపెనీపై చర్యలు చేపట్టాలని కోరారు.
News December 1, 2024
VZM: అలా జరిగి ఉంటే వాళ్లు బతికే వాళ్లేమో..!
భోగాపురం రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళానికి చెందిన అభినవ్ భార్య మణిమాల విశాఖలో పరీక్ష రాయాల్సి ఉంది. అభినవ్ ఫ్రెండ్ కౌశిక్ వాళ్ల మేనమామ అమెరికా నుంచి వస్తుండటంతో రిసీవ్ చేసుకోవడానికి విశాఖకు బయల్దేరారు. ‘మేమూ నీతో వస్తాం’ అంటూ మణిమాల, అభినవ్ అదే కారులో బయల్దేరారు. ఒకవేళ ఆ భార్యాభర్త వేరుగా విశాఖకు బయల్దేరి ఉంటే బతికేవారేమో. విధి ఆడిన నాటకంలో ఇలా చనిపోయారని బంధువులు వాపోయారు.
News December 1, 2024
VZM: పరిశ్రమలు ప్రారంభించకపోతే భూకేటాయింపు రద్దు
పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో నిర్ణీత గడువులోపల పరిశ్రమలను ఏర్పాటు చేయకపోతే, కేటాయింపులను రద్దు చేయాల్సి ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లా స్థాయి సమీక్షలో శనివారం ఆయన మాట్లాడారు. త్వరలో బొబ్బిలి గ్రోత్ సెంటర్‌ను సందర్శించి, కేటాయింపులపై సమీక్షిస్తామని అన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములపై సమగ్ర నివేదికను తయారు చేయాలని ఆదేశించారు.