News March 19, 2024
సింహాచలం: చందనోత్సవం రోజున అంతరాలయ దర్శనాలు రద్దు

సింహాచలం అప్పన్న బాబు ఆలయంలో మే 10వ తేదీన నిర్వహించే చందనోత్సవం రోజున అంతరాలయ దర్శనాలు రద్దు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఉత్సవానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ రోజున కేవలం విధుల్లో ఉన్న వైదికలు, ఆలయ సంప్రదాయం ప్రకారం అనుమతులు ఉండే వాళ్లకు మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పించాలని సూచించారు. ఆరోజున ఘాట్ రోడ్డులో కేవలం మినీ బస్సులు మాత్రమే నడపాలని అన్నారు.
Similar News
News November 4, 2025
VZM: రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ధి

విజయనగరం జిల్లాలో 109 చిన్నతరహా చెరువులను రూ.55 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. చెరువుల అభివృద్ధిపై నేడు సమావేశం నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ పథకం క్రింద ఐదు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో ఈ చెరువులు అభివృద్ధి కానున్నాయని చెప్పారు. మొత్తం మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలన్నారు.
News November 4, 2025
యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష: విజయనగరం ఎస్పీ

జామి మండలం మాదవరాయమెట్ట గ్రామానికి చెందిన వంతల శివ (23)పై పోక్సో కేసులో నేరం రుజువై 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. బాధిత బాలికకు రూ.50వేల పరిహారం మంజూరు చేసిందన్నారు. కేసు దర్యాప్తు చేసి, నిందితుడిని శిక్షించడంలో జామి పోలీసుల కృషిని ఎస్పీ అభినందించారు. 2024లో బాలికపై అత్యాచారానికి పాల్పాడగా శిక్ష ఖరారైందని తెలిపారు.
News November 4, 2025
ప్రజా సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించండి: SP

ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 54 ఫిర్యాదులు స్వీకరించి, వాటిలో భూగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించినవని తెలిపారు. ఫిర్యాదులపై తక్షణ స్పందనతో 7 రోజుల్లో పరిష్కారం కల్పించాలని సూచించారు.


