News April 2, 2025
సింహాచలం చందనోత్సవానికి మంత్రికి ఆహ్వానం

సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో ఈనెల 8న జరిగే వార్షిక తిరు కళ్యాణోత్సవం, 30వ తేదీన జరిగే నిజరూప దర్శనం చందనోత్సవానికి హాజరుకావాలని ఈవో సుబ్బారావు హోంమంత్రి వంగలపూడి అనితను కోరారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే సింహాద్రి అప్పన్న ప్రసాదాన్ని స్వామివారి చిత్రపటం శేష వస్త్రాలను మంత్రికి అందజేశారు.
Similar News
News December 5, 2025
ఖమ్మం: విద్యుత్ షాక్తో యువకుడి మృతి

విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News December 5, 2025
డిసెంబర్ 5: చరిత్రలో ఈ రోజు

*1901: హాలీవుడ్ దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
*1905: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం షేక్ అబ్దుల్లా జననం
*1985: టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధవన్ జననం
*1992: హీరోయిన్ పాయల్ రాజ్పుత్ జననం
*2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(ఫొటోలో) మరణం
*2016: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం
* ప్రపంచ నేల దినోత్సవం
News December 5, 2025
మెదక్ జిల్లాలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 160 పంచాయతీలకు 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అదే విదంగా జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలు జరిగే 1,402 వార్డులకు గాను 332 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. ఇందులో 14 గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయినట్లు వివరించారు.


