News April 13, 2025
సింహాచలం: చందనోత్సవానికి 51 ప్రత్యేక బస్సులు

సింహాచలంలో ఏప్రిల్ 30న జరిగే చందనోత్సవానికి కొండ మీదకు 51 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు శనివారం తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండమీదకు వెళ్లే బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గోశాల, శ్రీనివాస్ నగర్, అడివివరం నుంచి ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆరోజున భక్తుల వాహనాలకు కొండమీదకు అనుమతి లేదని, ఈ బస్సులు వినియోగించుకోవాలన్నారు.
Similar News
News April 16, 2025
తిరుపతిలో అమానుష ఘటన

తిరుపతి రూరల్ మండలం బీటీఆర్ కాలనీలో ఓ వృద్ధుడు స్థానికంగా ఉంటున్న పిల్లలకు తన ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. నిన్న తన ఇంట్లో ముగ్గురు చిన్నారులకు వీడియోలు చూపిస్తుండగా స్థానికులు గమనించారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు మేస్త్రి పనులు చేసే సెల్వంగా గుర్తించి అతడి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
News April 16, 2025
HYDలో ఓపెన్ 10th, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు

HYD జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్ఓ వెంకటాచారి ఆదేశించారు. జిల్లాలో 73 కేంద్రాల్లో 15,068 మంది విద్యార్థులు హాజరవుతారు. సెల్ఫోన్లను అనుమతించరు. 144 సెక్షన్ అమలు చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయి. మౌలిక సదుపాయాలు, బందోబస్తు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
News April 16, 2025
హెచ్ఎం పోస్టులకు సీనియారిటీ జాబితా విడుదల: DEO

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో HM పోస్టుల భర్తీ కోసం అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. ఉద్యోగోన్నతులు పొందాలనుకునే ఉపాధ్యాయులు ఈ జాబితాను deovgnt.blogspot.com వెబ్సైట్లో పరిశీలించవచ్చని DEO రేణుక తెలిపారు. జాబితాలో పొరపాట్లు గమనించిన వారు ఈనెల 20లోపు గుంటూరు DEO కార్యాలయానికి లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు తెలపాలన్నారు.