News January 29, 2025

సింహాచలం: చిరకాల సమస్యకు ఫుల్ స్టాప్..!

image

చిరకాలంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు కూటమి ప్రభుత్వం బుధవారం ఫుల్ స్టాప్ పెట్టింది. సీఎం చంద్రబాబు విశాఖ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పంచ గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 12వేల మందికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పంచగ్రామాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వ నిర్ణయంపై మీ కామెంట్ 

Similar News

News December 16, 2025

సింహాచలం కొండపై HT లైన్‌లకు గ్రీన్ సిగ్నల్

image

సింహాచలం కొండపై నుంచి NSEL వరకు HT విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఏపీ ట్రాన్స్‌కోకు అనుమతినిచ్చింది. ఈప్రాజెక్టులో భాగంగా దేవస్థాన భూముల్లో 27 టవర్ల లైన్లు వేయాల్సి ఉంది. ఇందుకుగాను వాడుకున్న స్థలానికి పరిహారంగా ట్రాన్స్‌కో ద్వారా దేవస్థానానికి రూ.15కోట్లు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈపనులను వెంటనే పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాలని ఆలయ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.

News December 16, 2025

విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

image

విశాఖలో మంత్రి లోకేశ్ మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. కంచరపాలెంలో ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందిన తనకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని సతీశ్వరరెడ్డి కోరారు. కోనసీమ, పోలవరంలో గుత్తైనదీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలనీ కోరారు.

News December 16, 2025

విశాఖలో ఐదుగురు ఎస్ఐ‌లను రేంజ్‌కు అప్పగింత

image

విశాఖ నగరంలో ఐదుగురు ఎస్ఐలపై పోలీస్ కమిషనర్ శంఖ బత్రబాగ్చి చర్యలు తీసుకున్నారు. తక్షణమే ఈ అధికారులను రేంజ్‌కు అప్పగిస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు. త్రీటౌన్ క్రైమ్ ఎస్ఐ సల్మాన్ బేగ్, టూటౌన్ క్రైమ్ ఎస్ఐ సునీల్, పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్, ఫోర్త్ టౌన్ క్రైమ్ ఎస్ఐ విజయ్‌కుమార్, భీమిలి ఎస్సై భరత్ కుమార్ రాజులు రేంజ్‌కు అప్పగించారు. ఈ చర్య పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.