News May 20, 2024
సింహాచలం: నేడు కూడా కొనసాగనున్న చందనం అరగదీత

సింహాచలం అప్పన్న బాబు ఆలయంలో చందనం అరగదీత కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. ఈనెల 23న స్వామికి రెండవ విడత 120 కిలోల చందనాన్ని సమర్పించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల 18న 40 కిలోలు, 19వ తేదీన37 కిలోల చందనాన్ని అరగదీసారు. సోమవారం కూడా చందనం అరగదీత కొనసాగుతుంది. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ ఏఈఓ ఆనంద్ కుమార్ చందనం అరగదీత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
Similar News
News December 16, 2025
విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభిరామ్?

విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చోడే పట్టాభి రామ్కు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించినట్లు సమాచారం. పట్టాభి 8వ వార్డులో మాజీ కార్పొరేటర్గా పని చేశారు. ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డు లోకల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
News December 16, 2025
‘సంక్రాంతికి విశాఖ-హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు నడపండి’

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – హైదరాబాద్ మధ్య తక్షణమే ప్రత్యేక రైళ్లు నడపాలని బీజేపీ రాష్ట్ర విధాన పరిశోధన విభాగ సభ్యుడు డాక్టర్ కె.వి.వి.వి.సత్యనారాయణ వాల్తేరు డీఆర్ఎంను కోరారు. ప్రస్తుతం రైళ్లన్నీ ‘రిగ్రెట్’ (Regret) స్థితిలో ఉన్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం భోగికి వారం ముందు, కనుమ తర్వాత అదనపు రైళ్లు, కోచ్లు ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.
News December 16, 2025
విశాఖ: సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు

పూసపాటిరేగకు చెందిన వాసుపల్లి రాములు (55) సముద్రంలో గల్లంతయ్యాడు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి శుక్రవారం బోటులో వేటకు వెళ్లాడు. ఆదివారం రాత్రి తీరానికి 70 మైళ్ల దూరంలో ఆయన ప్రమాదవశాత్తు బోటుపై నుంచి సముద్రంలో జారిపడ్డాడు. సహచర సిబ్బంది గాలించినా ఆచూకీ లభించలేదని, మంగళవారం సాయంత్రం ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసినట్లు పోర్ట్ సీఐ రమేశ్ తెలిపారు.


