News April 9, 2024

సింహాచలం: నేడు సింహాద్రి అప్పన్నకు పెళ్లి రాట

image

సింహాచలం ఆలయంలో ఉగాది సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం అప్పన్న బాబు పెళ్లి రాట మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 19వ తేదీన స్వామి వారి వార్షిక కళ్యాణం నిర్వాహంలో భాగంగా ఈ వేడుక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆలయంలో వైదిక కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆలయ ఆస్థానం మండపం వేదికపై పంచాంగ శ్రవణం నిర్వహిస్తారన్నారు.

Similar News

News November 11, 2024

విశాఖలో ప్రారంభమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

విశాఖ జిల్లా కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభమైంది. ప్రజల నుంచి వినతులు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్. భవానీ శంకర్, ఆర్డీవో పి. శ్రీలేఖ, ఏడీసీ వర్మ స్వీకరిస్తున్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు హాజరయ్యారు.

News November 11, 2024

తలసరి ఆదాయంలో విశాఖనే నంబర్ 1

image

ఏపీలో జిల్లాల విభజన తర్వాత తొలిసారిగా తలసరి ఆదాయం లెక్కలు బహిర్గతమయ్యాయి. 2022-23కు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం రూ.4.83 లక్షలతో విశాఖ టాప్ ప్లేస్‌లో ఉంది. రూ.2.10 లక్షలతో అనకాపల్లి 10వ స్థానంలో నిలవగా.. రూ.1.37 లక్షలతో అల్లూరి సీతారామరాజు చివరి స్థానానికి పరిమితమైంది. 2021-22లో కృష్ణా మొదటి స్థానంలో విశాఖ 2వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

News November 11, 2024

విశాఖ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొంతు వినిపిస్తారా?

image

నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి విశాఖ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, స్టీల్ ప్లాంట్ సమస్య, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.