News November 5, 2024
సింహాచలం: పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేసుకోవచ్చు

సింహాచలం ఆలయం పరిధిలో గల పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయం పరిధిలో గల పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేయించడం, పైఅంతస్తులు నిర్మించుకోవడం చెల్లదు. దీనిపై గతంలో కోర్టులు కూడా యథాతథస్థితిని ప్రకటించాయి. నిబంధనలు సడలిస్తూ దేవాదాయ శాఖ మెమో జారీ చేసింది. దీనిపై పంచ గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News July 9, 2025
సీఎంను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సీఎం చంద్రబాబును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి, శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.
News July 9, 2025
‘అప్పుఘర్ వద్ద సిద్ధంగా గజఈతగాళ్ళు’

అప్పుఘర్ వద్ద గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నేడు జరగనున్న గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్లు అజిత జువేరి, లక్ష్మీనారాయణ పరిశీలించారు. అప్పుఘర్‌లో గిరిప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీలు ఏసీపీ నర్సింహామూర్తికి పలు సూచనలు చేశారు. విద్యుత్ వెలుగులతో పాటు బందోబస్తు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు.
News July 9, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణ.. 200 ప్రత్యేక బస్సులు

ఈనెల 9న విశాఖలో జరిగే గిరి ప్రదక్షిణకు సింహాచలం కొండకింద నుంచి పైకి వెళ్లేందుకు, మరల పైనుంచి కిందకి వచ్చేందుకు 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. సింహాచలం నుంచి నగరంలోకి వచ్చేందుకు 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జులై 9, 10వ తేదీల్లో సిబ్బందికి విధించిన డ్యూటీల మేరకు హాజరవ్వాలన్నారు.